ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురేంధేశ్వరి విమర్శించారు. ఆత్మకూరు రోడ్ల దుస్థితిని వివరించిన ఆమె... ప్రసవవేధనతో ఉన్న మహిళను ఆత్మకూరు రోడ్లపై తీసుకెళ్తే... ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రసవం అయిపోయేలా ఉన్నాయి అంటూ విమర్శించారు. మార్పు రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమౌతుందన్నారు పురంధేశ్వరి